సీతమ్మ మెడలో అక్షరమాల

సీతమ్మ మెడలో అక్షరమాల

 

అవని పుత్రికవై పుట్టి జనకుని ఇంట పెరిగావు

ఆనందంతో అత్తవారింట అడుగు పెట్టావు

ఇలలో శ్రీరాముడికి ధర్మ పత్నివైనావు

ఈ జగములో నీలాంటి వనిత లేదమ్మా

ఉత్తమ ఇల్లాలు నీవమ్మా

ఊర్మిళా దేవికి సోదరీవమ్మా

ఋషుల తల్లిగా మెలిగావమ్మా

ఎన్నడూ రాముని మాట జవదాటని నిన్ను

ఏడేడు లోకాలు కీర్తించాయమ్మా

ఐకమత్యం అంటే అర్ధం మీ కుటుంబమేనమ్మా

ఒక్కదానివే చిటికెన వేలితో శివధనస్సును ఎత్తిన నీవు

ఓర్పుతో లంకలో రాక్షస బాధలు భరించావమ్మా

ఔరా అని అఖిల లోకాలు కొనియాడే అగ్నిపుత్రివి నీవమ్మా

అంజనీ పుత్రుని భక్తిని మెచ్చి అష్ట సిద్ధులకు దాతవు కమ్మని దీవించావు

ఆహా!! పతివ్రతలలో నీవు పెద్ద పీఠమెక్కావు కదమ్మా

 

నా ఈ చిన్ని అక్షరమాలని స్వీకరించి

నన్ను కూడా దీవించమ్మా !!!!!

—————————————————————————ఉమా పల్లవి

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *