రైతు యొక్క గడియారము

                                                          రైతు యొక్క గడియారము

 

ఒక మారు ఒక రైతు  గడియారము   ఎచ్చటో పడి పోయినది. .  ఆ   గడియారము  పెద్దగా ఖరీదైనది    కానప్పటికి   దానితో అతనికి  భావనాత్మక సంబంధము  వుండేది  . అందుకే ఎలాగైనా దానిని తిరిగి  పొందాలని  అనుకున్నాడు  .  ఆ  రైతు ఇల్లంతా గాలించాడు . ధాన్యము నింపే  ధాన్యాగారములో   కూ డ వెదికాడు  . ఎంత  శ్రమ పడి  వెదికినా  ఆ గడియారము  కనిపించలేదు  . అతను కొంత మంది పిల్లల సహాయము తో  దానిని    వెదకాలని   నిశ్చయించుకొని   వారిని  పిలిచి ” పిల్లలూ  నేను  ఒక గడియారమును   పోగొట్టుకున్నాను    దానిని   వెదకి  తెచ్చిన వారికి  వంద రూపాయలు  బహుమానముగా   ఇస్తానని  తెలిపాడు .

 

ఇంక పిల్లలు అందరూ గోల గోల గా వెదికే పనిలో పడ్డారు     .     వారు అన్ని వైపులా    పైనా  కిందా  , ఇంటా బయటా  అన్ని  స్థలాల లోనూ  వెదికారు .       సమయము గడచిపోతూంది ,    పిల్లలలో నిరాశ చోటు చేసుకుంది    .      ఇంక ఆ గడియారము  దొరకదని    వారు  ఓటమిని  అంగీకరించారు    మరియు   ఆ రైతు కూడా  నిరాశగా  ఇంక  గడియారము  దొరకదని   అనుకుంటున్న   సమయములో   ఒక బాలుడు  ఆయన   దగ్గరకు  వచ్చి ” బాబాయ్  ! నాకు ఇంకొక   అవకాశము   ఇవ్వండి ,   .  కానీ ఈసారి నేను   ఒక్కడినే   వెదుకుతాను”  అన్నాడు  .   రైతుకు ఎలాగైనా గడియారము    కావాలి    .   అందుకే    వెంటనే   సరే  అన్నాడు  .   ఆ బాలుడు   ఒక్కొక్క  గది చూసుకుంటూ   ఆ యన     పడక గది లో    నుంచి    గడియారముతో    బయటకు వచ్చాడు  .    రైతు గడియారము   చూడగానే    చాల ప్రసన్నుడై   ఆశ్చర్యముతో  ” బాబూ! ఇది ఎచ్చట దొరికింది  .  అందరూ చూసి విఫలమైనాము  కదా     మరి నీకు ఎ లా కనిపించింది  అని అడిగాడు .    అందుకు ఆ బాలుడు ఇలా సమాధానము      ఇచ్చాడు .     బాబాయ్      నే  ను ఏమీ చెయ్యలేదు.      గదిలోకి వెళ్లి నిశ్శబ్దముగా         కూర్చుని   గడియారము   యొక్క   శబ్దముపై   ద్యాస పెట్టాను . గది అంతా శాంతిగ   ఉన్నందున   ఆ గడియారము   యొక్క   టిక్ టిక్   శబ్దము  వినిపించినది .   తద్వారా నేను  బీరువా వెనుక పడి వున్న గడియారము తీసుకొని వచ్చాను        .

మిత్రులారా! ఎలాగైతే  గదిలోని  శాంతి   ,     గ డియారము                     వె ద కడానికి   సహాయపడిందో   అలాగే   మనస్సుకు   శాంతి   జీవితానికి   ఏదైతే ఆవశ్యకమో  వాటిని  అర్థము  చేసుకోడానికి     సహాయపడుతుంది  .    ప్రతి రోజూ మనము   మన కొరకు   కొంత  సమయాన్ని   కేటాయించాలి  .    మనము ఆ సమయములో   ఏకాంతంగా   వుండాలి  .     ప్రశాంతము గా   కూర్చుని  మనతో మనము   మాట్లాడా  లి.   మన అంతరాల ద్వనిని   వినాలి.        అప్పుడే   మనము  జీవితాన్ని   మంచి    దృక్పథముతో    జీవించ కలుగుతాము.    .

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *