చెట్టు
కాలుష్యము తృంచును చెట్టు
ప్రాణవాయువు ఇచ్చును చెట్టు
వానలకు కారణం తాను
పంటలను పెంచును తాను!
స్త్రీల చేతిలో చేటను
పూల కగును బుట్టను
వేసవి ఎండల్లో వర్షపు చినుకుల్లో కూడ
పక్షులకు గూడయ్యి కాచెద చూడ!
రైతన్నకు బండిని నేను
కుమ్మరికి చక్రాన్ని నేను
జ్జాన మిస్తిని సన్యాసికి
బోధి నేనే బుద్ధునికి!
నేను ఆటలాడే బ్యాటును
నువ్వు ఖర్చుచేసే నోటును
రాసేందుకు కాగితం నేనే
రాసే పెన్సిలులోనూ నేనే
కూర్చునే కుర్చీ నేను
నిదురనిచ్చే మంచం నేను
బలము నిచ్చెటి ఫలములం
రోగము నొప్పుల్లో మందులం!
మనిషికి ఆహారమౌతా
మనసుకు ఆహ్లాదమైతా
తోడుగా ఉంటాను చివరికి
కట్టెనై కాల్చెద కడసారికి!
గడప గా మీ ఇంటిని కాపాడతా
పడవ గా మిమ్మల్ని నది దాటిస్తా
గిడుగు గా ఎండవానాల్లో కాస్తా
గిరిజనులకు అలంకారాలనిస్తా
అడవిలో కొమ్మ నేను
చెక్కితే బొమ్మను నేను
గుడిలో పెట్టి నమ్మగా
వరము లిచ్చెద అమ్మగా!
పచ్చదనానికి మూలం చెట్లు
పర్యావరణం, ప్రగతికి మెట్లు
మనిషికొక్క మొక్కను నాటు
మనుషుల మనుగడకు అదే తోడ్పాటు!